Monday 19 August 2013

తెలంగాణ రాష్ట్రాన్ని చూపే అరుదైన మొదటి ఎస్సార్సీ మ్యాప్


         అరుదైన మొదటి ఎస్సార్సీ మ్యాప్!



తెలంగాణ ఉద్యమం గురించి ఓనమాలు కూడా తెలవకుండా మాట్లాడేవాళ్లు తెలుసుకోవాల్సిన సంగతి ఇది.
తమకొక రాష్ట్రం అయ్యే అన్ని అర్హతలు ఉన్నాయని తెలంగాణ ప్రజలు 1954లో కేంద్రప్రభుత్వం నియమించిన రాష్ట్రాల పునర్విభజన కమీషన్ (ఫజల్ అలీ కమీషన్) కు విజ్ఞాపనలు ఇచ్చిండ్రు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలను మన్నించిన ఫజల్ అలీ కమీషన్ 1955లో తెలంగాణ రాష్ట్రాన్ని (ఆపుడు హైదరాబాద్ అనేవారు దీన్ని) ఏర్పాటు చేయమని సిఫారసు చేసింది.

1955లో ఫజల్ అలీ కమీషన్ సిఫారసు చేసిన రాష్ట్రాల మ్యాప్ ఇది. ఇందులో తెలంగాణ కూడా ఉంది. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న తెలంగాణ రాష్ట్రం నిజానికి 1956లోనే ఏర్పడాల్సింది. ఆంధ్ర నాయకుల లాబీయింగ్ తో అప్పుడు వెనకకు పోయిన రాష్ట్రమే ఇప్పుడు సాకారమవుతుంది.
ఈసారి తెలంగాణ ఏర్పాటుకు రెండో ఎస్సార్సీ వేయాలని ఎవరైనా వాగితే వారి మొఖాన ఈ మ్యాప్ కొట్టండి.


No comments:

Post a Comment